Home న్యూస్ రవితేజ…ఫిబ్రవరి…ఏంటి సామి ఈ దారుణం!!

రవితేజ…ఫిబ్రవరి…ఏంటి సామి ఈ దారుణం!!

0

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన రీసెంట్ మూవీస్ లో ఒకటి హిట్ పడితే వెంటనే ఫ్లాఫ్స్ కూడా పడుతూ ఉండగా రవితేజ రీసెంట్ మూవీస్ లో 2 సినిమాలు మాత్రమె హిట్ అవ్వగా మిగిలిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాఫ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన టైం ఎలా ఉన్నా కూడా ఫిబ్రవరి నెల మాత్రం రవితేజకి….

అసలు ఏమాత్రం కలిసి రాలేదు అనే చెప్పాలి ఇప్పుడు….కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలను గమనిస్తే… ఫిబ్రవరి లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకున్నాయి… అప్పట్లో షాక్ మూవీతో మొదటి షాక్ తగలగా తర్వాత చేసిన సినిమాల్లో….

Raviteja Eagle 3 Days Total WW Collections!

నిప్పు, టచ్ చేసి చూడు, ఖిలాడి లాంటి సినిమాలు ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా ఫిబ్రవరి నెలలోనే రిలీజ్ అయిన రవితేజ కొత్త సినిమా ఈగల్(Eagle Movie) డీసెంట్ కలెక్షన్స్ ని వీకెండ్ లో సొంతం చేసుకున్నా కూడా వర్కింగ్ డేస్ లో హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా…

ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యి మరోసారి నిరాశ పరిచిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా నిలిచింది, వరుసగా ఫిబ్రవరి నెలలో రవితేజ నటించిన 5 సినిమాలు రిలీజ్ అయ్యి అన్ని సినిమాలు కూడా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి…వీటిలో ఈగల్ మూవీ బెటర్ మూవీనే అయినా కూడా అన్ సీజన్ ఎఫెక్ట్ వలన ఫ్లాఫ్ రిజల్ట్ నే సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు. 

మంచి డేట్ ను సెట్ చేసుకుని సమ్మర్ లో రిలీజ్ అయినా లేక ఏదైనా పండగ టైంలో రిలీజ్ అయినా కూడా సినిమాకి ఇంకా బెటర్ రిజల్ట్ సొంతం అయ్యి ఉండేది…. ఓవరాల్ గా రవితేజ సినిమాలు ఫిబ్రవరి లో రిలీజ్ అవుతున్నాయి అంటే వాటి రిజల్ట్ పై ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. రవితేజ ఫ్యూచర్ మూవీస్ లో ఏ సినిమాతో మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

Raviteja Eagle 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here