Home న్యూస్ 24 గంటలు ఓవర్….ఫ్యామిలీ స్టార్ టీసర్ టాప్ 2 తో మాస్ ఊచకోత!

24 గంటలు ఓవర్….ఫ్యామిలీ స్టార్ టీసర్ టాప్ 2 తో మాస్ ఊచకోత!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) రీసెంట్ మూవీస్ తో అంచనాలను అందుకోలేక పోయాడు, లాస్ట్ మూవీ ఖుషి సినిమా కూడా పర్వాలేదు అనిపించే రివ్యూలతో కూడా బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయింది. ఇలాంటి టైంలో ఇప్పుడు గీత గోవిందం(Geetha Govindam Movie) డైరెక్టర్ పరశురాం(Parasuram) తో….

చేస్తున్న కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్(Family Star Movie) తో సమ్మర్ లో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. టీసర్ లో ఒక పిసినారి మిడిల్ క్లాస్ హీరో తన లైఫ్ లో ఫేస్ చేసిన…

పరిస్థితులు ఏంటి అనేది కథగా ఈ సినిమాలో ఉండబోతుంది అని టీసర్ లో చూపించగా ఓవరాల్ గా టీసర్ కి రెస్పాన్స్ బాగా రాగా యూట్యూబ్ లో 24 గంటల్లో టీసర్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ఓవరాల్ గా సొంతం అయ్యింది అని చెప్పాలి. వ్యూస్ పరంగా మాత్రం ఏకంగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో…

ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది… ఓవరాల్ గా 24 గంటలలో ఫ్యామిలీ స్టార్ టీసర్ కి 9.82 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యి టాప్ 2 ప్లేస్ ను అందుకోగా లైక్స్ పరంగా 190.3K లైక్స్ మార్క్ ని అందుకుంది..వ్యూస్ పరంగా దుమ్ము లేపినా లైక్స్ పరంగా ఓవరాల్ గా జస్ట్ ఓకే అనిపించుకుంది.

కానీ సినిమా టీసర్ కి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వడంతో సినిమా మీద అంచనాలు బాగానే పెరిగాయి అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ లో సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే విజయ్ దేవరకొండకి మంచి కంబ్యాక్ మూవీ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here