Home న్యూస్ 24 గంటల రికార్డ్….18 గంటల్లో ఔట్….సలార్ ఊచకోత ఇది!

24 గంటల రికార్డ్….18 గంటల్లో ఔట్….సలార్ ఊచకోత ఇది!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) ఆడియన్స్ ముందుకు ఈ నెల క్రిస్టమస్ కానుకగా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా రికార్డులతో దుమ్ము లేపుతూ…

ఈ ట్రైలర్ టాలీవుడ్ రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతుంది, ట్రైలర్ టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష నుండి 1.1 మిలియన్స్ లైక్స్ వరకు కొత్త రికార్డులను నమోదు చేసి దుమ్ము లేపగా వ్యూస్ పరంగా టాలీవుడ్ లో ట్రైలర్ ల పరంగా 24 గంటల రికార్డు విషయంలో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు…

ఇది వరకు 24 గంటల రికార్డుల పరంగా సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా ట్రైలర్ 26.77 మిలియన్ వ్యూస్ ని అందుకోగా ఈ రికార్డ్ ను 18 గంటల టైం మాత్రమే తీసుకుని సలార్ ట్రైలర్ కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. 18 గంటల్లో రికార్డ్ బ్రేక్ చేసిన సలార్ సినిమా ట్రైలర్…

ఇప్పుడు టాలీవుడ్ ట్రైలర్స్ పరంగా ఫాస్టెస్ట్ 30 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా 24 గంటల్లో సౌత్ రికార్డ్ కూడా నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. రికార్డులతో దుమ్ము లేపుతున్న సలార్ ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో ఊచకోత కొస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here