Home న్యూస్ అక్షరాలా 25 కోట్ల షేర్ ఔట్!!

అక్షరాలా 25 కోట్ల షేర్ ఔట్!!

0

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కెరీర్ ని మొదలు పెట్టి చాలా ఏళ్ళు అవుతున్నా కానీ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న భారీ బ్లాక్ బస్టర్ ను ఎట్టకేలకు ఇప్పుడు బింబిసార సినిమాతో సొంతం చేసుకున్నాడు కళ్యాణ్ రామ్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా 7వ రోజు సాధించబోతున్న కలెక్షన్స్ తో…

కళ్యాణ్ రామ్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ రికార్డ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ లో మొట్ట మొదటి సారిగా బింబిసార సినిమా తోనే 20 కోట్ల షేర్ మార్క్ ని 40 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్…

ఇప్పుడు ఈ సినిమా తో మొదటి సారిగా 25 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో 24.84 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న బింబిసార సినిమా ఇప్పుడు 7వ రోజు సాధించిన…

కలెక్షన్స్ తో 25 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి ఇప్పుడు 30 కోట్ల షేర్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉంది, లాంగ్ రన్ లో సినిమా 30 కోట్లు ఆ పైనా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here