నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వి ది మూవీ. సుదీర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నాని 25 వ సినిమా అవ్వడం తో ఆడియన్స్ లో మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ పాటికే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా ఎఫెక్ట్ తో పోస్ట్ పోన్ అయింది.
ఇక ఈ ఎఫెక్ట్ ఇప్పట్లో పోయేలా లేక పోవడం తో కొత్త సినిమాలు ఎప్పుడు వస్తాయి అన్నది కూడా క్లారిటీ లేకుండా పోగా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఎన్నో సినిమా లు ఇప్పటికే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని కన్ఫాం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఎక్కువగా హిందే లో ఇది జరగగా తెలుగు లో చిన్న సినిమాలే ఇప్పటి వరకు రిలీజ్ అయ్యాయి. కానీ నాని 25 వ సినిమా పై క్రేజ్ భారీగా ఉండగా ఇటు అమెజాన్ ప్రైమ్ అటు ఆహా వీడియో వాళ్ళు సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి మంచి ఆఫర్స్ ఇస్తున్నారని తెలుస్తుంది.
అమెజాన్ ప్రైమ్ 25 కోట్ల ఆఫర్ కోట్ చేయగా ఆహా వీడియో వాళ్ళు ఏకంగా 30 కోట్ల ఆఫర్ ని కోట్ చేశారు. ప్రస్తుతం నాని మార్కెట్ దృశ్యా 30 నుండి 35 కోట్ల రేంజ్ బిజినెస్ ఈజీగా సొంతం చేసుకుంటాయి ఏ సినిమా అయినా… ఆ లెక్కన చూస్తె ఈ సినిమా బిజినెస్ ఆఫర్ మరీ గొప్పది ఏమి కాదనే చెప్పాలి కానీ…
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృశ్యా సేఫ్ ఆఫర్ కింద చెప్పొచ్చు కానీ నాని 25 వ సినిమా అవ్వడం ఎట్టి పరిస్థితులలో థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తానని కన్ఫాం చేశాడు. దాంతో ఈ సారి ఆఫర్ మరింత పెంచి ట్రై చేస్తారన్న టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది. మరి అప్పుడు ఎం డిసిషన్ తీసుకుంటారో చూడాలి మరి…