బాక్స్ ఆఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన బింబిసార తన కెరీర్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాంగ్ రన్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అన్ని సెంటర్స్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం…
ముఖ్యంగా సినిమా రాయలసీమ ఏరియాలో సృష్టించిన కలెక్షన్స్ భీభత్సం అయితే నెక్స్ట్ లెవల్ మాస్ రాంపేజ్ అని చెప్పాలి ఇప్పుడు. సినిమా రిలీజ్ టైం లో టాలీవుడ్ లో వరుస ఫ్లాఫ్ మూవీస్ ఎఫెక్ట్ గట్టిగా ఉండగా ఈ సినిమా బిజినెస్ తక్కువకే జరిగింది.
సినిమాను రాయలసీమ ఏరియాకి గాను ఓవరాల్ గా 2 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ కలెక్షన్స్ ని వీకెండ్ లోనే రిటర్న్ తీసుకు రాగా తర్వాత కూడా పరుగును సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగించి లాభాలను డబుల్ ట్రిపుల్ ఇలా పెంచుకుంటూ పోయినా కానీ మళ్ళీ తగ్గకుండా….
ఏకంగా పెట్టిన బడ్జెట్ మీద 4 రెట్లు అధికంగా వసూళ్ళని రాయలసీమలో అందుకుని సంచలనం సృష్టించింది. 4 వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా రాయలసీమ ఏరియాలో 8.05 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పెట్టిన రేటు మీద అక్షరాలా 4 రెట్లు అధికంగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక టోటల్ గా ఈ ఏరియా లో ఈ సినిమా…
సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్క అటూ ఇటూగా 12 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… ఈ రేంజ్ లో కలెక్షన్స్ అంటే టాలీవుడ్ బిగ్ హీరోల సినిమాలకు మాత్రమె సాధ్యం అవుతూ ఉంటాయి. అలాంటి కలెక్షన్స్ ని బింబిసార రాయలసీమ ఏరియాలో సొంతం చేసుకుని ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.