బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో ఉన్నంతలో కామెడీతో పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఆకట్టుకున్న ప్రదీప్ మాచిరాజు(pradeep machiraju) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(Akkada Ammayi Ikkada Abbayi Movie) సినిమా…
కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపెడుతుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ గా 65 లక్షల లోపు గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకోగా…
రెండో రోజు ఏమైనా గ్రోత్ ని చూపెడుతుంది అనుకున్నా కూడా మరీ ఆశించిన మేర అయితే ట్రెండ్ ను చూపించ లేక పోయింది. బుక్ మై షో లో కనీసం 5 వేల టికెట్ సేల్స్ ను కూడా అందుకోలేక పోయిన సినిమా ఓవరాల్ గా 2వ రోజున తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద…
55 లక్షల రేంజ్ లోనే గ్రాస్ మార్క్ ని అందుకున్నట్లు అంచనా…ఇక వరల్డ్ వైడ్ గా 60 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అటూ ఇటూగా సొంతం చేసుకోగా ఓవరాల్ గా రెండు రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని మాత్రమే సొంతం చేసుకోగా…
వరల్డ్ వైడ్ గా 1.20 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా షేర్ 60 లక్షల రేంజ్ లోనే ఉండే అవకాశం ఉండగా… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించు కోవాలి అంటే మినిమమ్ 4 కోట్ల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమాకి వచ్చిన టాక్ కి ఇంకొంచం బెటర్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మూడు నాలుగు రోజుల్లో హాలిడేస్ ఉండటంతో మంచి గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.