Home న్యూస్ 2 డేస్ జాట్ మూవీ కలెక్షన్స్….డే 3 హోల్డ్ కుమ్ముతుందిగా!!

2 డేస్ జాట్ మూవీ కలెక్షన్స్….డే 3 హోల్డ్ కుమ్ముతుందిగా!!

0

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో గదర్2 తో హిందీ లో సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న సన్నీ డియోల్(Sunny Deol) తో చేసిన భారీ బడ్జెట్ మూవీ జాట్(Jaat Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి హిందీ ఆడియన్స్ నుండి ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా మొదటి రోజున…

పార్షిక హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో సన్నీ డియోల్ కెరీర్ లో సోలో హీరోగా సెకెండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న జాట్ మూవీ రెండో రోజు ఫుల్ వర్కింగ్ డే లో మరోసారి మంచి హోల్డ్ ని చూపించి ఇప్పుడు మూడో రోజు నుండి 5వ రోజు వరకు ఎక్స్ లెంట్ గా…

జోరు చూపించడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా మొదటి రోజున 9.63 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకోగా రెండో రోజు ఫుల్ వర్కింగ్ డే లో లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా..

7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించడం విశేషం…దాంతో మొత్తం మీద సినిమా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి 16.63 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మంచి హోల్డ్ ని చూపించగా…

ఇప్పుడు మూడో రోజు ఆల్ మోస్ట్ మొదటి రోజు లెవల్ లో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉన్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో ఈ రోజు డబుల్ డిజిట్ నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది… సినిమా 100 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే హిందీ లో క్లీన్ హిట్ అనిపించుకోవచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here