Home న్యూస్ 2 రోజుల్లో టార్గెట్ ఔట్….యానిమల్ ఊరమాస్ ఊచకోత!

2 రోజుల్లో టార్గెట్ ఔట్….యానిమల్ ఊరమాస్ ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రణబీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal Movie) అన్ని చోట్లా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోయింది. తెలుగు రాష్ట్రాలలో సైతం ఒక మీడియం రేంజ్ మూవీ…

ఏ రేంజ్ లో బజ్ ఉంటే రచ్చ చేస్తుందో అలాంటి రచ్చ చేసింది ఈ సినిమా, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో సినిమా సాధించిన భారీ బిజినెస్ ను సినిమా అవలీలగా అందుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. తెలుగు లో సినిమా ఓవరాల్ గా 14 కోట్ల రేంజ్ లో రేటుకి….

అన్ని వర్షన్ లు కలిపి బిజినెస్ 14 కోట్ల రేంజ్ రేటుకి సొంతం అవ్వగా సినిమా మొదటి రోజే సగానికి పైగా కలెక్షన్స్ ని కవర్ చేసి దుమ్ము దుమారం లేపగా తర్వాత రెండో రోజు ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది, 2 రోజుల టోటల్ షేర్ 14.50 కోట్ల దాకా ఉండటం విశేషం కాగా రెండు రోజుల్లోనే సినిమా…

Animal 2 Days Total WW Collections!

బిజినెస్ ను దాటేసి మైనస్ ప్రాఫిట్స్ ను ఎంజాయ్ చేయగా మూడో రోజు కలెక్షన్స్ తో సినిమా భారీ లాభాలను కూడా సొంతం చేసుకుని దుమ్ము లేపింది, ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న సినిమా ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళ పరంగా సంచలనం సృష్టించడం విశేషం.

సినిమా 3వ రోజు ఎలక్షన్స్ రిజల్ట్ హడావుడి ఉన్నప్పటికీ థియేటర్స్ లో సెన్సేషనల్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తున్న యానిమల్ సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో కూడా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దూసుకు పోతుంది, సినిమా ఊపు చూస్తుంటే లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Animal 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here