బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు సినిమా మొదటి రోజు అనుకున్న అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయింది. ఇక సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి డ్రాప్స్ ను హెవీగానే సొంతం చేసుకుని ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా నిరాశ పరచడానికి సిద్ధం అవుతుంది… సినిమా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు మొత్తం మీద….
ఆల్ మోస్ట్ 40% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొన్ని క్లాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో 80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఇక అన్ని చోట్లా లెక్కలు బాగుంటే 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు సగం టార్గెట్ ని అందుకోవడానికి కూడా సరిపోవు అనే చెప్పాలి…ఇక టోటల్ 2 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.