బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారానికే చేతులు ఎత్తేసింది. కాగా సినిమా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా డౌన్ అయిపోగా మొదటి వారం తర్వాత అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా కొండంత ఉండగా రెండో వారం కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం తో థాంక్ యు మూవీ థియేటర్స్ కౌంట్…
భారీగా పడిపోయింది అని చెప్పాలి. మొదటి వారం రిలీజ్ అవ్వడం 665 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రెండో వారానికి వచ్చే సరికి నైజాంలో 52 థియేటర్స్ ని, సీడెడ్ లో 25 వరకు థియేటర్స్ ని ఆంధ్ర లో మొత్తం మీద 75 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసింది.
దాంతో టోటల్ తెలుగు రాష్ట్రాలలో సినిమా కేవలం 155 థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగిస్తూ ఉండగా మొదటి వారంతో పోల్చితే ఆల్ మోస్ట్ 500 కి పైగా థియేటర్స్ ని కోల్పోయి భారీ ఎదురుదెబ్బని సొంతం చేసుకుంది. ఇక ఈ థియేటర్స్ లో ఎంత వరకు కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.