ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమానే అయినా కూడా ఊహకందని రేంజ్ లో నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది… ఆల్ మోస్ట్…
8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా….రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెట్టించిన జోరుతో బుకింగ్స్ పరంగా కుమ్మేస్తూ ఉండగా…ఇతర సినిమాల కన్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తూ ఉండటంతో….కోర్ట్ మూవీ షో కౌంట్ రెండో రోజుకి…
మరింతగా పెరిగిపోగా కలెక్షన్స్ పరంగా కూడా సినిమా అన్ని చోట్లా రెండో రోజు మాస్ కుమ్ముడు కుమ్మేస్తూ ఉండటంతో ఈవినింగ్ అండ్ నైట్ షోల టైంకి ట్రెండ్ మరింత సాలిడ్ గా ఉండే అవకాశం ఉండగా…ఓవరాల్ గా సినిమా రెండో రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర….
ఓవరాల్ గా 4.5-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా…ఈవినింగ్ అండ్ నైట్ షోల జోరు ని బట్టి ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో కూడా మాస్ కుమ్ముడు కుమ్మేస్తూ హాల్ఫ్ మిలియన్ మార్క్ ని…
సొంతం చేసుకునే అవకాశం ఉండగా..లాంగ్ రన్ లో ఓవర్సీస్ లో సినిమా మరింత జోరు చూపించే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా 20-22 కోట్ల రేంజ్ మార్క్ దిశగా దూసుకు పోతుంది. ఇక రెండో రోజు ఎండ్ అయ్యే టైంకి సినిమా ఈ అంచనాలను ఎంతవరకు మించిపోతుందో చూడాలి ఇప్పుడు.