Home న్యూస్ 2nd డే మనమే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…ఈ రోజు కూడా కుమ్ముతుందిగా!

2nd డే మనమే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…ఈ రోజు కూడా కుమ్ముతుందిగా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) ఫస్ట్ డే అనుకున్న దాని కన్నా బెటర్ గా ఓపెన్ అయింది, ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో శర్వానంద్ ప్రీవియస్ మూవీ కన్నా బెటర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా….

ఇప్పుడు రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ లో మంచి ట్రెండ్ నే చూపెడుతూ ఉండగా ట్రాక్ చేసిన సెంటర్స్ లో మొదటి రోజు కి సిమిలర్ గా కొన్ని చోట్ల ట్రెండ్ బెటర్ గా ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా సినిమా మంచి జోరుని చూపిస్తూ ఉండటంతో సినిమా ఇప్పుడు రెండో రోజున…

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కోటి మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల్లో జోరు మొదటి రోజు లెవల్ లో కనిపిస్తే 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా 1.6 కోట్ల నుండి ఆ పైన షేర్ ని అందుకోవచ్చు…ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను అందుకోక పొతే…

కలెక్షన్స్ కొంచం తగ్గొచ్చు… ఓవరాల్ గా సినిమా  రెండో రోజు మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని హోల్డ్ చేస్తుంది…కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా బెటర్ గా ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద సినిమా 2 రోజులకు సాధించే టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here