Home న్యూస్ 2nd డే ఓం భీమ్ బుష్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

2nd డే ఓం భీమ్ బుష్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా జోరు చూపించిన శ్రీవిష్ణు(Sree vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush Collections) సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇంకొంచం ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకున్నా ఓవరాల్ గా 1.15 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంది.

సినిమా నైజాంలో బాగానే జోరు చూపించినా ఆంధ్ర సీడెడ్ లో మాత్రం పెద్దగా జోరు చూపించలేదు, ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా ట్రాక చేసిన సెంటర్స్ లో కొన్ని చోట్ల డే 1 కి సిమిలర్ గా ట్రెండ్ అవుతున్నా కొన్ని చోట్ల  కొంచం గ్రోత్ కూడా కనిపిస్తూ ఉందని చెప్పాలి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై అలాగే…

IPL క్రికెట్ మ్యాచ్ ల ఇంపాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.1-1.2 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి….

వరల్డ్ వైడ్ గా సినిమా 1.4 కోట్ల రేంజ్ నుండి 1.5 కోట్ల రేంజ్ లో వసూళ్ళని రెండో రోజు అందుకునే అవకాశం కనిపిస్తుంది. మరి 2వ రోజు నైట్ షోలు సాలిడ్ గా సాగి ఈ అంచనాలను మించుతాయా లేక ఇదే రేంజ్ లో వసూళ్ళని సాధిస్తాయో చూడాలి. ఇక 2 రోజుల టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ లు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here