Home న్యూస్ డిజే టిల్లుకి 3.4 కోట్లు…ఇప్పుడు టిల్లు2 ఈ రేంజ్ రేటు ఏంటి సామి!!

డిజే టిల్లుకి 3.4 కోట్లు…ఇప్పుడు టిల్లు2 ఈ రేంజ్ రేటు ఏంటి సామి!!

0

రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను మించి ఆడియన్స్ ను ఆకట్టుకుని భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా డిజే టిల్లు(Dj Tillu Movie), ఆ సినిమాతో ఓవర్ నైట్ లో వరుస ఆఫర్స్ తో దుమ్ము లేపిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda)వేరే సినిమాలను ఒప్పుకున్నా కూడా…

ముందుగా డిజే టిల్లు సినిమాకి సీక్వెల్ అయిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) తో సందడి చేయాలనీ డిసైడ్ అవ్వగా సినిమా ఎప్పుడో రిలీజ్ అనుకున్నా కూడా కొంచం డిలే అవుతూ ఇప్పుడు ఫైనల్ గా ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా….

సినిమా మీద ట్రేడ్ లో మంచి బజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ కాబోతుంది, మీడియం రేంజ్ మూవీనే అయినా ఏమాత్రం పార్ట్ 1 రేంజ్ లో జోరు చూపిస్తే కచ్చితంగా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఒక్కో ఏరియాలో బిజినెస్ ఆల్ మోస్ట్ క్లోజ్ అవుతూ ఉంది….

రీసెంట్ గా సినిమాకి ఆంధ్ర ఏరియాలో బిజినెస్ క్లోజ్ అవ్వగా ఆల్ మోస్ట్ 11.50 కోట్ల రేంజ్ రేటుని సొంతం చేసుకుని బిజినెస్ కంప్లీట్ అయిందని అంటున్నారు…. పార్ట్ 1 కి ఆంధ్ర ఏరియాలో ఓవరాల్ గా 3.40 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది… ఇక ఇప్పుడు పార్ట్ 2 కి ఆల్ మోస్ట్ 11.50 కోట్ల రేంజ్ బిజినెస్ దక్కింది…

ఇక పార్ట్ 1 టోటల్ రన్ లో ఆంధ్ర ఏరియాలో ఆల్ మోస్ట్ 5 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకుని మంచి లాభాలను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న పార్ట్ 2 ఈ బిజినెస్ మీద ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here