సమ్మర్ లో పెద్ద సినిమాల ప్లేస్ లో ఆడియన్స్ ను అలరించడానికి భారీ లెవల్ లో బరిలోకి దిగిన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) కలెక్షన్స్ పరంగా సినిమా కాంబో రేంజ్ కి న్యాయం అయితే చేయలేక పోయింది అనే చెప్పాలి.
మొదటి రోజు కలెక్షన్స్ పరంగా భారీగా అండర్ పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా రెండో రోజులో అడుగు పెట్టగా టాక్ ఇంపాక్ట్ క్లియర్ గా టికెట్ సేల్స్ లో కనిపిస్తూ ఉంది, ట్రాక్ చేసిన సెంటర్స్ లో బుకింగ్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలకి ఫ్యామిలీ ఆడియన్స్ భారీ లెవల్ లో వచ్చి కలెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండగా…
ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని రెండో రోజు సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఓవర్సీస్ లో సైతం రీసెంట్ టైంలో విజయ్ దేవరకొండ కెరీర్ లో లోవేస్ట్ ఓపెనింగ్స్ ను వసూల్ చేసిన సినిమా వీకెండ్ లో ఎంతవరకు గ్రోత్ ని చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.
ఓవరాల్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో భారీ గ్రోత్ ఏమినా ఉండి కలెక్షన్స్ తో సాలిడ్ గా ఇంప్రూవ్ మెంట్ ఉంటే తప్పితే సినిమా డే 2 రేంజ్ 2 కోట్లకు అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుందో చూడాలి ఇప్పుడు.