Home TRP రేటింగ్ 132CR భగవంత్ కేసరి….2nd టైం TRP షాకిచ్చిందిగా!!

132CR భగవంత్ కేసరి….2nd టైం TRP షాకిచ్చిందిగా!!

0

లాస్ట్ ఇయర్ దసరా కి మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఓపెనింగ్స్ పరంగా స్లో స్టార్ట్ ను సాధించినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ పవర్ ను చూపించి లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టించిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) భగవంత్ కేసరి(Bhagavanth Kesari TRP Rating) సినిమాతో…

బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాలను నమోదు చేసి బాక్ టు బాక్ మూడు సార్లు 70 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా సినిమా టోటల్ రన్ లో ఏకంగా 132 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో మంచి విజయాన్ని నమోదు చేసింది. తర్వాత డిజిటల్ లో కూడా సినిమా…

మంచి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోగా టెలివిజన్ లో మంచి రేటుకి శాటిలైట్ రైట్స్ బిజినెస్ ను దక్కించుకుని డీసెంట్ ప్రమోషన్స్ తో ఫస్ట్ టెలికాస్ట్ జీ తెలుగు లో జరిగినప్పుడు 9.36 టి.ఆర్.పి రేటింగ్ సొంతం చేసుకుని మంచి జోరునే చూపించింది, దాంతో రీసెంట్ గా సినిమాను రెండో సారి టెలికాస్ట్ చేశారు ఛానెల్ లో….

Bhagavanth Kesari 12 Days Total WW Collections!!

కానీ రెండో సారి టెలికాస్ట్ లో మాత్రం సినిమా కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసి టి.ఆర్.పి రేటింగ్ పరంగా బాగానే స్లో అయింది అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే స్టోరీ తోనే వచ్చిన ఈ సినిమా రెండో టెలికాస్ట్ లో హోల్డ్ ని చూపెడుతుంది అనుకున్నా 3.77 టి.ఆర్.పి రేటింగ్ సొంతం చేసుకుంది….

ఇది మరీ తక్కువ రేటింగ్ ఏమి కాదు కానీ సినిమా బాక్స్ అఫీస్ విజయానికి ఇంకా బెటర్ గా హోల్డ్ ని అందరూ టి.ఆర్.పి రేటింగ్ పరంగా ఎక్స్ పెర్ట్ చేశారని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టెలివిజన్ లో రెండో సారికే స్లో అవ్వగా తర్వాత టెలికాస్ట్ లలో అయినా పుంజుకుంటుందో లేదో చూడాలి ఇప్పుడు.

Bhagavanth Kesari 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here