హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంబంధం లేకుండా సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, రీసెంట్ గా రిలీజ్ అయ్యి సంచలన కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది…
అన్ని చోట్లా కుమ్మేసిన సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని దాటేసిన సినిమా మంచి లాభాలను సొంతం చేసుకుంటూ ఉండగా తమిళనాడులో సినిమా మాస్ రచ్చ చేసింది. ఎపిక్ కలెక్షన్స్ ని మిక్సుడ్ టాక్ తో లో హైప్ తో వచ్చిన మూవీతో సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా సినిమా తమిళనాడులో ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. కోలివుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే తమిళనాడులో ఇప్పుడు విజయ్ పేరిట ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించాడు…
రెండు సార్లు విజయ్ నటించిన సినిమాలు తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ ను సొంతం చేసుకోవడం ఎపిక్ రికార్డ్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ విజయ్ నటించిన లియో మూవీ తో మొదటి సారి 200 కోట్ల మార్క్ ని అందుకున్న…
విజయ్ ఇప్పుడు రెండో సారి విజయ్ గోట్ మూవీ మరోసారి ఈ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు….ఇలా రెండు సార్లు ఈ రికార్డును అది కూడా బాక్ టు బాక్ మూవీస్ తో ఈ సెన్సేషన్ ని క్రియేట్ చేయడం ప్రస్తుతానికి కోలివుడ్ చరిత్రలో అందుకున్న ఒకే ఒక్కడిగా నిలిచాడు విజయ్… ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి.