Home గాసిప్స్ 3 డిసాస్టర్లు…అయినా బాలయ్య బోయపాటి మూవీ బిజినెస్ ఊరమాస్ లెవల్!!

3 డిసాస్టర్లు…అయినా బాలయ్య బోయపాటి మూవీ బిజినెస్ ఊరమాస్ లెవల్!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ మంచి కంబ్యాక్ ఇస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే, సింహా లెజెండ్ లాంటి సినిమాలతో సంచలన కలెక్షన్స్ ని సాధించిన బాలయ్య మళ్ళీ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తో తన రేంజ్ ని చూపెట్టి దుమ్ము లేపాడు, తర్వాత జై సింహా కూడా పర్వాలేదు అనిపించుకున్నా కానీ తర్వాత చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది.

ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు మరియు రూలర్ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి ఒకటికి మించి ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా ఈ సినిమాల తర్వాత బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో హాట్రిక్ మూవీ ని కమిట్ అయిన విషయం తెలిసిందే.

సింహా లెజెండ్ సినిమాల తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతూ ఉండగా ఇది వరకు ఫ్లాఫ్ మూవీస్ ఎఫెక్ట్ ఏమాత్రం కూడా ఈ సినిమా పై పడటం లేదు. ఈ సినిమా రీసెంట్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ ని కంప్లీట్ చేసుకుందని సమాచారం.

వరుస ఫ్లాఫుల్లో ఉన్నా కానీ బాలయ్య బోయపాటి ల సినిమా క్రేజ్ పవర్ తో మొత్తం మీద ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ 28 కోట్ల రేటు ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది, తెలుగు శాటిలైట్ రైట్స్ ని 11.5 కోట్లకు సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని 9 కోట్ల రేటు కి సొంతం చేసుకోవడం విశేషం. ఇక రీసెంట్ గా సినిమా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్…

కూడా సాలిడ్ రేటు కి అమ్ముడు పోయాయి…హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ రేటు 8.5 కోట్ల రేటు సొంతం చేసుకుందని సమాచారం. అంటే కేవలం నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం మీద 28 కోట్ల రేటు సొంతం చేసుకోగా ఇక సినిమా అసలు సిసలు బిజినెస్ ఇంకా బాలెన్స్ ఉంది, సమ్మర్ రేసులో నిలవనున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here