Home గాసిప్స్ 70 కోట్ల సినిమా…75 రోజులు….రచ్చ ఖాయం!!

70 కోట్ల సినిమా…75 రోజులు….రచ్చ ఖాయం!!

1303
0

2019 సంక్రాంతి రేసులో మినిమం అంచనాలతో బరిలోకి దిగి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సినిమా ఎఫ్ 2, విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి రేసులో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సంచలన విజయం తో టోటల్ రన్ లో 84 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి టాలీవుడ్ తరుపున…

మోస్ట్ ప్రాఫిట్స్ ని సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. అలాంటి సినిమా కి ఇప్పుడు సీక్వెల్ మరింత భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న విషయం తెలిసిందే, అపజయం అంటే తెలియకుండా దూసుకు పోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి… ఎఫ్ 2 తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర….

మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోగా తర్వాత చేస్తున్న లేటెస్ట్ మూవీ ఎఫ్ 3 ని రీసెంట్ గా అఫీషియల్ గా లాంచ్ చేశారు. విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా తమన్నా హీరోయిన్ గా కన్ఫాం అవ్వగా మిగిలిన యాక్టర్స్ కన్ఫాం అవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమా ను ఏకంగా…

70 కోట్లకు పైగా బడ్జెట్ తో స్టైలిష్ గా తెరకెక్కించబోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాలను చాలా త్వరగా ముగిస్తాడు అన్న విషయం తెలిసిందే, ఇప్పుడు ఈ సినిమా విషయం లో కూడా తన స్పీడ్ ని చూపెట్టబోతున్నారని సమాచారం. ఈ నెల 23 న షూటింగ్ మొదలు కాబోతున్న ఈ సినిమా ను 75 రోజుల వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా…

పూర్తీ చేయాలనీ డిసిషన్ తీసుకున్నాడట రావిపూడి… మార్చ్ ఎండ్ టైం కల్లా సినిమా ని పూర్తీ చేసి ఏప్రిల్ లో కానీ మే లో కానీ సినిమా ను సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలి అన్నది అనిల్ ప్లాన్ అని అంటున్నారు, దిల్ రాజు దానికి తగ్గట్లే అరేంజ్ మెంట్స్ చూసుకుంటున్నారని సమాచారం. మరి సినిమా మొదటి సినిమా సాధించిన రేంజ్ లో రచ్చ చేస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here