బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో మూడేళ్ళ క్రితమే రిలీజ్ అవ్వాల్సిన సినిమా 1945… షూటింగ్ ఎండ్ టైం లో హీరో రానా దగ్గుబాటికి నిర్మాత కి మధ్య కొన్ని క్లాషెస్ రావడం వలన ఈ సినిమా షూటింగ్ నుండి హీరో తప్పుకోగా సినిమాను మధ్యలోనే వదిలేసెంత డిఫెరెన్సెస్ రావడంతో ఈ సినిమా ను రానా అస్సలు పట్టించుకోలేదు తర్వాత టైం లో… కానీ ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు అతి త్వరలో తీసుకు వస్తున్నామంటూ….
నిర్మాతలు పోస్టర్ లు కూడా వదలగా ఈ సినిమా కి నాకు అసలు ఎలాంటి సంభందం లేదు అంటూ రానా ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. ఇలా సినిమా అనేక సార్లు పోస్ట్ పోన్ అవ్వగా టోటల్ బడ్జెట్ లెక్క 20 కోట్ల రేంజ్ కి వెళ్ళింది. ఎట్టకేలకు సంక్రాంతి టైం లో..
పాన్ ఇండియా మూవీస్ అన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో జనాలను థియేటర్స్ కి రప్పించడానికి సినిమాలు ఉండాలి కాబట్టి తమ సినిమాకి వస్తారేమో అనుకుని 1945 మూవీని రిలీజ్ చేశారు కానీ అసలు జనాలు ఈ సినిమా అంటూ ఒకటి ఉందీ అనేది కూడా పట్టించు కోలేదు….
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ నుండే డిసాస్టర్ గా కొనసాగగా రెండు రోజుల్లో 8 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 20 లక్షల గ్రాస్ ను అందుకుంది. ఇక మిగిలిన రన్ లో టోటల్ గా మరో 7 లక్షల షేర్ ని 12 లక్షల గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 లక్షల షేర్ ని 32 లక్షల దాకా గ్రాస్ ను….
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అందులో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీసేస్తే వచ్చేది జీరో షేర్ అని చెప్పాలి. ఆ రేంజ్ లో దెబ్బ కొట్టిన ఈ సినిమా బడ్జెట్ ప్రకారం చూసుకుంటే ఊహకందని నష్టాలను మిగిలించింది అని చెప్పాలి. రానా ఎంత వద్దు అనుకున్నా తన కెరీర్ లో మరో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా అయింది.