Home న్యూస్ 3 ఏళ్ల క్రితం సినిమా…ఇప్పుడు OTT లో అదరగొడుతుంది!!

3 ఏళ్ల క్రితం సినిమా…ఇప్పుడు OTT లో అదరగొడుతుంది!!

0

ఈ కరోనా ఎఫెక్ట్ వలన సినిమాల రిలీజ్ లు పూర్తిగా ఆగిపోగా థియేటర్స్ ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదు. దాంతో అందరూ ఓవర్ ది టాప్ యాప్స్ లో వచ్చే సినిమాలు, షో లు చూస్తూ కాలం గడిపేస్తున్నారు… దాంతో కొన్ని యాప్స్ లో కొన్ని సినిమాల టాక్ అండ్ క్రేజ్ దృశ్యా కొన్ని సినిమాలు బాగానే ఆదరణ ని సొంతం చేసుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో కీర్తి సురేష్ నటించిన….

పెంగ్విన్ సినిమా రీసెంట్ టైం లో బెస్ట్ ట్రెండ్ అయిన సినిమాగా నిలవగా నెట్ ఫ్లిక్స్ లో మరో సినిమా ఇలానే ట్రెండ్ అయ్యింది. అదే కృష్ణ అండ్ హిస్ లీల మూవీ…. చిన్న సినిమా నే అయినా కానీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయినప్పటి నుండి కూడా…

ఈ సినిమా వ్యూస్ సాలిడ్ గా వస్తూనే ఉన్నాయని తెలుస్తుంది. కొన్ని రోజులకు ఈ సినిమా ఆహా యాప్ లో కూడా స్త్రీం అవుతున్నా కానీ నెట్ ఫ్లిక్స్ లో జోరు తగ్గడం లేదట. ఇక్కడ మరో విశేషం ఏంటో తెలుసో…. ఈ సినిమా ఇప్పటి సినిమా కాదు…

మూడేళ్ళ క్రితమే రూపొందిన సినిమా అనేక కారణాలతో ఆగి పోతూ ఆగి పోతూ చివరికి ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని తక్కువ రేటు ఆఫర్ తో సొంతం చేసుకుని ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సూపర్ హిట్ అనిపించు కుంటూ దూసుకు పోతుంది ఈ సినిమా. గుంటూరు టాకీస్ సినిమా తర్వాత వెంటనే కమిట్ అయిన సినిమా ఇదట…

హీరో సిద్ధూ అప్పుడే ఈ సినిమా షూట్ ని కూడా కంప్లీట్ చేయగా అనేక కారణాల వల్ల సినిమా ఆగిపోతూ వచ్చింది, ఎట్టకేలకు సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ప్రాజెక్ట్ ని తీసుకుని మే నెలలో రిలీజ్ చేయాలి అనుకున్నా లాక్ డౌన్ వలన మంచి ఫ్యాన్సీ రేటు కి నెట్ ఫ్లిక్స్ కి ఆహా కి అమ్మేశారు. ఇప్పుడు వాళ్ళు ప్రాఫిట్ లో ఉన్నారు… సినిమా 3 ఇయర్స్ కి రిలీజ్ అయ్యి ఇప్పుడు OTT హిట్ గా నిలిచింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here