మన సినిమాలను మనం కన్నా కూడా నార్త్ ఆడియన్స్ ఎక్కువ గా చూస్తున్నారు అన్నది మాత్రం క్లియర్ అయింది, అక్కడ రొటీన్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అవుతున్నారో, లేక సౌత్ యాక్షన్ మూవీస్ అంటే ఎక్కువ ప్రేమ పెరిగిందో తెలియదు కానీ ఇక్కడ మన కమర్షియల్ మూవీస్ కి అక్కడ గిరాకీ మాత్రం మరో లెవల్ లో ఉందని చెప్పాలి. ఇక్కడ అ సినిమాల రిజల్ట్ గురించి పక్కకు పెట్టి మరీ…
అక్కడ భారీ లెవల్ లో ఆ సినిమాలను వ్యూస్ వస్తుండటం విశేషం అనే చెప్పాలి. అక్కడ చాలా సినిమాలకు ఇప్పటికే 100, 200 మిలియన్స్ వ్యూస్ లు అవలీలగా వస్తుండగా ఆత్యదిక వ్యూస్ ని అందుకున్న సినిమాగా కొన్ని సినిమాలు నిలిచాయి. వాటిలో ముందుగా….
300 మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమా గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా నిలవగా పలుసార్లు డిలేట్ అయ్యి మళ్ళీ అప్లోడ్ అయినా కానీ ఈ సినిమా ఈ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం చేయగా ఇప్పుడు 300 మిలియన్ మార్క్ ని అందుకున్న రెండో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ నిలిచాడు.
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేసిన జయ జానకి నాయక ఇక్కడ ఓవర్ బిజినెస్ వల్ల హిట్ కాకపోయినా కానీ హిందీ డబ్బింగ్ వర్షన్ ఊచకోత కోసే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది, సినిమా అక్కడ లేటెస్ట్ గా ఇప్పుడు 300 మిలియన్ మార్క్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకుని ఈ మార్క్ ని అందుకున్న రెండో సినిమాగా నిలిచింది.
అలాగే అల్లు అర్జున్ తర్వాత ఈ మార్క్ ని అందుకున్న రెండో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ అక్కడ సంచలనం సృష్టించాడు. ఈ సినిమా తో పాటు మరికొన్ని బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు కూడా అక్కడ రికార్డ్ లెవల్ వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా అల్లుడు అదుర్స్ షూటింగ్ ని ముగించే పనిలో ఉన్నాడని సమాచారం…