కెరీర్ మొదలు పెట్టి ఎన్నో ఏళ్ళు అవుతున్నా కానీ ఎక్కువగా ఫ్లాఫ్ మూవీస్ తో సరిపెట్టుకుంటూ వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు ఇప్పుడు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అది తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అనిపించే రేంజ్ లో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దూసుకు పోతుంది. సినిమా 2 రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 20 కోట్ల రేంజ్ లో….
గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేయగా ఇప్పుడు మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని….
దక్కించుకోగా ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రీసెంట్ టైం లో బెస్ట్ కలెక్షన్స్ తో వీకెండ్ ని అది కూడా పోటిలో మరో ఎక్స్ లెంట్ మూవీ ఉన్నప్పటికీ సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా ఇప్పుడు కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇది వరకు పటాస్ మూవీ ఆల్ మోస్ట్ 29 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఆ కలెక్షన్స్ ని జస్ట్ 3 రోజుల్లోనే బ్రేక్ చేసిన బింబిసార బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 30 కోట్ల గ్రాస్ ను అందుకోగా…
ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 24.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల గ్రాస్ ను అందుకుంది. కెరీర్ లో నంబర్ 1 గా నిలిచిన బింబిసార ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో ఈ బెంచ్ మార్క్ ని భారీ లెవల్ లో తీసుకు వెళుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి.