బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 7 వారాలను పూర్తీ చేసుకుని దుమ్ము లేపింది. సినిమా తెలుగు వర్షన్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినా కానీ హిందీ లో లిమిటెడ్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ని ఇప్పుడు నమోదు చేసి సంచలనం సృష్టించింది…
7 వ వారంలో కూడా హిందీ లో స్టడీగా లిమిటెడ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించిన పుష్ప సినిమా హిందీ లో మాత్రం కలెక్షన్స్ ఇప్పటికీ వస్తూ ఉండటం విశేషం. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా 7 వారాలు పూర్తీ అయ్యే టైం కి….
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క 350 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది….. మిగిలిన చోట్ల క్లోజ్ అయినా హిందీలోసాధిస్తున్న కలెక్షన్స్ వలన సినిమా ఈ మార్క్ ని అందుకుందని చెప్పాలి. మొత్తం మీద సినిమా 49 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 40.74Cr(Without GST 37.47Cr)
👉Ceeded: 15.17Cr
👉UA: 8.13Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.35CR(133.25CR~ Gross)
👉Karnataka: 11.78Cr
👉Tamilnadu: 13.63Cr
👉Kerala: 5.60Cr
👉Hindi: 47.73Cr
👉ROI: 2.25Cr
👉OS – 14.56Cr
Total WW: 181.00CR(350.20CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 7 వారాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్…
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాను మొత్తం మీద 144.9 కోట్ల రేటు కి అమ్మగా 146 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 7 వారాల తర్వాత సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 35 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక సినిమా పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి.