Home న్యూస్ అక్షరాలా 37 కోట్లు….ఊహకందని ఊచకోత!!

అక్షరాలా 37 కోట్లు….ఊహకందని ఊచకోత!!

0

సెకెండ్ వేవ్ తర్వాత ఇండియా వైడ్ గా వచ్చిన సినిమాలలో టాలీవుడ్ ఇండస్ట్రీ వరుస సినిమాలతో జోరు చూపగా లవ్ స్టొరీ సినిమా ఊరమాస్ కలెక్షన్స్ తో ఇప్పుడు దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 10.6 కోట్ల గ్రాస్ ని అందుకోగా, వరల్డ్ వైడ్ గా 16.8 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక రెండో రోజు సినిమా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా తెలుగు రాష్ట్రాలలో 19.30 కోట్ల గ్రాస్ ని అందుకోగా, వరల్డ్ వైడ్ గా 27.10 కోట్ల గ్రాస్ ను అందుకుని ఊచకోత అంటే ఇదే అనిపించుకుంది. ఇక మూడో రోజు కూడా సినిమా ఆదివారం అడ్వాంటేజ్ తో….

తెలుగు రాష్ట్రాలలో అన్ని సెంటర్స్ లో కూడా కుమ్మేస్తూ ఉండగా సినిమా ఇప్పుడు 3 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 8-9 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునేలా కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా మూడో రోజు 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునేలా కుమ్మేస్తుంది…

Love Story 2 Days Total Collections!!

దాంతో ఇప్పుడు 3 రోజుల వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా 37 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో ఈ కలెక్షన్స్ ఊరమాస్ మెంటల్ కలెక్షన్స్ అనే చెప్పాలి. నైజాం లో అల్టిమేట్ ట్రెండ్ కొనసాగిస్తున్న ఈ సినిమా అమెరికాలో సెకెండ్ వేవ్ తర్వాతే కాదు ఈ ఇయర్ లోనే ది బెస్ట్ అనిపించుకునేలా…

ట్రెండ్ అవుతూ దుమ్ము దుమారం చేస్తుంది. ఇక ఇదే జోరు ని వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేసి కొనసాగిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ లో సాధించిన అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

Love Story 1st Day Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here