Home న్యూస్ ఓం భీమ్ బుష్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్….కుమ్మింది సినిమా!

ఓం భీమ్ బుష్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్….కుమ్మింది సినిమా!

0

ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush) మూవీ మంచి జోరుని చూపించి మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి మంచి జోరు ని చూపించగా….

మరీ అంచనాలను అయితే మించి పోలేక పోయింది సినిమా…నైట్ షోలకు IPL మ్యాచ్ ఇంపాక్ట్ కొద్ది వరకు పడింది అని చెప్పొచ్చు. 1.6 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే ఓవరాల్ గా సినిమా 1.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా 3వ రోజున సొంతం చేసుకుంది…

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 3.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని దక్కించుకుంది ఈ సినిమా….దాంతో ఇప్పుడు మొత్తం మీద 3 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Om Bheem Bush 3 Days WW Collections!!

Om Bheem Bush 3 Days Total WW Collections 
👉Nizam: 2.15CR~
👉Total AP: 2.10CR~
Total AP-TG Collections:- 4.25CR(7.60CR~ Gross)
👉KA+ROI+OS -1.55CR
Total WW Collections – 5.80CR(10.80CR~ Gross)

మొత్తం మీద సినిమా 10 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మూడు రోజులు పూర్తి అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 4.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును కొనసాగిస్తుందో చూడాలి.

Om Bheem Bush 2 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here