Home న్యూస్ 3 డిసాస్టర్ల తర్వాత మార్పు…ఇప్పుడు రచ్చ లేపుతున్న శ్రీ విష్ణు!!

3 డిసాస్టర్ల తర్వాత మార్పు…ఇప్పుడు రచ్చ లేపుతున్న శ్రీ విష్ణు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ హీరోలు తమకి ఎలాంటి సినిమాలు సెట్ అవుతాయో అన్నది తెలుసుకోవడానికి చాలా టైం తీసుకుంటూ ఉండగా కొందరు తమకి సెట్ అవ్వని జానర్ లో సినిమాలు చేస్తూ అంచనాలను అందుకోలేక పోతూ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకుంటున్నారు….

ఈ లిస్టులో యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) కూడా కొంతకాలం నిలిచాడు… కెరీర్ లో మొదట్లో ఎక్స్ పెరి మెంటల్ మూవీస్ తో మంచి పేరుని సొంతం చేసుకున్నా కూడా కమర్షియల్ సక్సెస్ లు అయితే దక్కలేదు… ఇలాంటి టైంలో బ్రోచేవారెవరురా తో మంచి సక్సెస్ ను అందుకుని తర్వాత మళ్ళీ నిరాశ పరిచే సినిమాలను…

తన సొంతం చేసుకున్న తర్వాత రాజ రాజ చోరతో సక్సెస్ ను అందుకున్నా కూడా తిరిగి ఎక్స్ పెరిమెంట్స్ చేసి అర్జున-ఫాల్గుణ, భళా తందనాన, అల్లూరి లాంటి సినిమాలతో మళ్ళీ ఎక్స్ పెరిమెంట్స్ చేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ తో వచ్చిన మార్కెట్ ను పోగొట్టుకున్నాడు…

Om Bheem Bush 3 Days WW Collections!!

కానీ ఈ సినిమాల తర్వాత తనకి కామెడీ సినిమాలు బాగా సెట్ అవుతాయి అని తెలుసుకున్న శ్రీ విష్ణు లాస్ట్ ఇయర్ సామజవరగమనా(Samajavaragamana) తో బ్లాక్ బస్టర్ కొట్టగా ఇప్పుడు తిరిగి ఓం భీమ్ బుష్(Om Bheem Bush) తో మరో సక్సెస్ ను తన సొంతం చేసుకోబోతున్నాడు….

ఇక మీదట చేసే సినిమాలు కూడా ఎంటర్ టైన్ మెంట్ ఫుల్లుగా ఉండేలా చూసుకుంటున్న శ్రీ విష్ణు తనకి సెట్ అయ్యే జానర్ ను గుర్తించి అవే జానర్స్ లో వరుస సినిమాలతో ఆడియన్స్ ను నవ్వించి హిట్స్ కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇక తన ఫ్యూచర్ మూవీస్ తో తన మార్కెట్ ఇంకా ఏ రేంజ్ లో పెంచుకుంటాడో చూడాలి.

Om Bheem Bush 2 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here