Home గాసిప్స్ జరగండి సాంగ్….ఈ ఒక్క సాంగ్ కి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే మైండ్ బ్లాంక్!

జరగండి సాంగ్….ఈ ఒక్క సాంగ్ కి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే మైండ్ బ్లాంక్!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer Movie) సినిమా నుండి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన జరగండి జరగండి(Jaragandi Song) ఎట్టకేలకు ఇప్పుడు రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు…

లీక్ అయినప్పుడు సింగర్ వాయిస్ వేరుగా ఉండగా ఇప్పుడు సింగర్ ను మార్చి కొత్త వర్షన్ గా ఈ సాంగ్ ను రిలీజ్ చేసినా ఆల్ మోస్ట్ లీక్ అయిన ఒరిజినల్ గానే ఉండగా సాంగ్ ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. సాంగ్ క్వాలిటీ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా…

ఈ సాంగ్ కోసం ఆల్ మోస్ట్ చిన్న టు మీడియం రేంజ్ మూవీ కి పెట్టినంత బడ్జెట్ ను పెట్టారు….ఇది వరకు సినిమా లో జరగండి సాంగ్ కి 12-14 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టారు అన్న వార్తలు వచ్చినా కూడా ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆల్ మోస్ట్ 17 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో…

సినిమాలో ఈ సాంగ్ ను రూపొందించారట….ఈ రేంజ్ బడ్జెట్ అది కూడా కేవలం ఒక్క సాంగ్ కోసమే పెట్టడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఓ భారీ సెట్ ను రూపొందించి ఈ సాంగ్ ను తెరకెక్కించగా ఇప్పుడు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్న సాంగ్ విజువల్స్ పరంగా థియేటర్స్ లో ఏ రేంజ్ లో పెట్టిన డబ్బుకి న్యాయం చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here