ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే ఇండియా లో చిన్న ఇండస్ట్రీలుగా పేరున్నవి కన్నడ ఇండస్ట్రీ మరియు మలయాళ ఇండస్ట్రీ….కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన కేజిఎఫ్, కాంతార సిరీస్ లు సంచలనాలు సృష్టించాయి కానీ మలయాళ ఇండస్ట్రీ మాత్రం చాలా టైంగా తమ మార్కెట్ ను పెంచుకోలేక పోయింది….
మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే 100 కోట్ల సినిమాలు ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువ…2024 ముందు వరకు చూసుకుంటే 2016 టైంలో పులి మురుగన్ మూవీ, 2019 టైంలో లూసిఫర్ 2023 ఇయర్ లో 2018 మూవీస్ 100 కోట్ల మార్క్ ని అందుకున్నాయి… కానీ 2024 ఇయర్ మలయాళ ఇండస్ట్రీకి ఓ రేంజ్ లో కలిసి వచ్చింది…
మొదటి నెల పెద్దగా జోరు చూపించలేదు కానీ ఫిబ్రవరి నుండి ఇండియా మొత్తాన్ని మలయాళ ఇండస్ట్రీ షేక్ చేస్తుంది అనే చెప్పాలి. బాక్ టు బాక్ 100 కోట్ల సినిమాలతో అన్ సీజన్ టైంలో రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు ఆల్ మోస్ట్ 4 సినిమాలు 100 కోట్ల గ్రాస్ ను అందుకున్నాయి….
ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ మరియు ఆడుజీవితం సినిమాలు బాక్ టు బాక్ 100 కోట్లతో దుమ్ము లేపితే రీసెంట్ గా పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ కూడా ఇప్పుడు ఆల్ మోస్ట్ 100 కోట్లకు చేరువ అయ్యింది. దాంతో ఇన్నేళ్ళ టైం లో 3 100 కోట్ల సినిమాలను సొంతం చేసుకున్న…
మలయాళ ఇండస్ట్రీ ఇప్పుడు ఒక్క 3 నెలల టైంకే 4 కొత్త 100 కోట్ల సినిమాలను తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఇయర్ లో మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ తో ఇండియాని షేక్ చేస్తున్నారు వీళ్ళు. ఇక ఇయర్ ఎండ్ టైంకి ఇంకా ఎన్ని సినిమాలు ఈ లిస్టులో యాడ్ అవుతాయో చూడాలి.