బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు తో దూసుకు పోతుంది, సినిమాకి ఆంధ్రలో లో టికెట్ రేట్ల వలన ఇబ్బంది ఎదురు అయినా కానీ సినిమా ఓవరాల్ గా మాత్రం దుమ్ము లేపింది అని చెప్పాలి. సినిమా రెండో రోజు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మూడో రోజు కి వచ్చే సరికి సినిమా….
రెండో రోజు లెవల్ లో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో ఓపెన్ అవ్వగా కొన్ని చోట్లా ఆక్యుపెన్సీ రెండో రోజు కన్నా కూడా కొంచం బెటర్ గా ఉందని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి సినిమా సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసి మంచి గ్రోత్ ని చూపించింది….
ఆంధ్రలో కలెక్షన్స్ ఎక్స్ లెంట్ గా ఉన్నా కానీ లో టికెట్ రేట్స్ ఎఫెక్ట్ వలన కలెక్షన్స్ పై ఇంపాక్ట్ ఉండగా చాలా ఏరియాల్లో టికెట్ రేట్స్ బ్లాక్ లోనే సేల్ అవుతుండగా చాలా చోట్లా టికెట్ రేట్లు ఎక్కువగానే పెట్టి అమ్ముతున్నా కానీ….
కలెక్షన్స్ రిపోర్ట్ మాత్రం లో టికెట్ రేట్స్ వే అప్ డేట్ చేస్తున్నట్లు సమాచారం. మరో పక్క నైజాంలో సినిమా మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము లేపగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా మూడో రోజు 12.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 13 కోట్ల మార్క్ ని….
అందుకునే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా మూడో రోజు సినిమా 14 కోట్ల నుండి 14.50 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. రెండో రోజు అంచనాలను మించే రేంజ్ లో దుమ్ము లేపిన భీమ్లా నాయక్ మూడో రోజు అఫీషియల్ కలెక్షన్స్ లో ఈ అంచనాలను అందుకుంటుందా లేక అంచనాలను మించి పోతుందో చూడాలి ఇక…..