మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ వాల్మీకి (గద్దల కొండ గణేష్) బాక్స్ ఆఫీస్ దగ్గర 2 రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది, టోటల్ వరల్డ్ వైడ్ గా 10.82 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా ప్యూర్ మాస్ మూవీ అవ్వడం తో ఓవర్సీస్ లో కొంచం తక్కువ వసూళ్లు సాధించింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో స్ట్రాంగ్ గా ఉన్న సినిమా మూడో రోజున ఎంటర్ అవ్వగా…
మూడో రోజు ఓపెనింగ్స్ కూడా సాలిడ్ గానే ఉన్నాయి, రెండో రోజు తో పోల్చితే మూడో రోజు డ్రాప్స్ 25% లోపు ఉండగా సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు మంచి ఆక్యుపెన్సీ తో నే రన్ అయింది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూరా జోరుగా సాగుతుండటం తో…
వాల్మీకి (గద్దల కొండ గణేష్) మూడో రోజు మొదటి రెండు షోల ఆన్ లైన్ టికెట్ సేల్స్ ప్రకారం 2.5 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ కన్ఫాం అని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ బాగా ఉండేలా కనిపిస్తున్నా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండటం తో కొంచం ఎఫెక్ట్ ఉండే అవకాశం కూడా ఉంది.
మొత్తం మీద అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2.7 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ బరిలో అందుకోవచ్చు. ఒకవేళ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ గ్రోత్ అనుకున్న రేంజ్ కి కూడా మించి ఉంటె ఈ లెక్క మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.
మొత్తం మీద సినిమా మొదటి వీకెండ్ తో సగానికి పైగా బిజినెస్ ని వెనక్కి తీసుకు రాబోతుంది, ఇక వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే అక్టోబర్ 2 సైరా నరసింహా రెడ్డి వచ్చే వరకు వాల్మీకి (గద్దల కొండ గణేష్) ఎదురు ఉండదని చెప్పొచ్చు. ఇక మూడో రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి…