డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ తర్వాత ఈ ఇయర్ సమ్మర్ లో చిత్రలహరి తో హిట్ కొట్టిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ రొజూ పండగే అంటూ ఫ్యామిలీ మూవీ తో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాడు.
సినిమా రెండు రోజుల్లోనే 7.47 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించగా మూడో రోజు ఆదివారం అవ్వడం తో మరింత జోరు చూపుతుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో 2 వ రోజు తో పోల్చితే మూడో రోజు డ్రాప్స్ చాలా తక్కువగా ఉన్నాయి.
కేవలం 5% నుండి 10% అటూ ఇటూ గా డ్రాప్స్ తొలి 2 షోలకు దక్కగా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా 15% కి పైగా గ్రోత్ ని సాధించింది, దాంతో సినిమా సినిమా రెండో రోజు కి మించి కలెక్షన్స్ ని మూడో రోజు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా మూడో రోజు 2.6 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ రెండో రోజు లాగే అంచనాలను మించితే గనుక 3 కోట్ల మార్క్ కూడా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా…
టోటల్ వరల్డ్ వైడ్ గా 3.5 కోట్ల రేంజ్ కి తగ్గని షేర్ ని 3 వ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉంది, దాంతో మొదటి వీకెండ్ వరల్డ్ వైడ్ గా సినిమా 10.5 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.