Home TRP రేటింగ్ 34 కోట్ల బ్లాక్ బస్టర్…స్మాల్ స్క్రీన్ పై TRP రేటింగ్స్ కుమ్మేస్తుందిగా!

34 కోట్ల బ్లాక్ బస్టర్…స్మాల్ స్క్రీన్ పై TRP రేటింగ్స్ కుమ్మేస్తుందిగా!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కెరీర్ లో మొదటి సినిమాల్లో హాట్రిక్ విజయాల తర్వాత వరుస పెట్టి డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ ని అందుకుని ఫాం ని కంప్లీట్ గా కోల్పోయిన టైం లో తిరిగి రెండు బాక్ టు బాక్ హిట్స్ తో మళ్ళీ జోరు అందుకున్నాడు.. లాస్ట్ ఇయర్ 2 విజయాలను అందుకున్న సాయి ధరం తేజ్ చిత్రలహరి సినిమా తో కంబ్యాక్ ని అలాగే ప్రతీ రోజూ పండగే తో…

కెరీర్ బెస్ట్ రికార్డులను కూడా నమోదు చేసి సంచలనం సృష్టించాడు… ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అన్న టాక్ తోనే ఏకంగా 34 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెండితెరపై నే కాదు బుల్లి తెరపై కూడా…

అద్బుతమైన TRP రేటింగ్ తో సాయి ధరం తేజ్ కెరీర్ బెస్ట్ గా నిలవగా లాంగ్ రన్ లో నాలుగు సార్లు టెలికాస్ట్ అయిన సినిమా కి ప్రతీ సారీ డీసెంట్ TRP రేటింగ్ దక్కుతుండటం తో బుల్లితెర పై కూడా సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది అని చెప్పొచ్చు.

సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 15.33 TRP రేటింగ్ ని అందుకోగా రెండో సారి సినిమా కి 6.13 TRP రేటింగ్ దక్కింది. ఇక మూడో సారి కూడా టెలికాస్ట్ అయనప్పుడు 6.13 TRP రేటింగ్ ని మరోసారి అందుకుని దుమ్ము లేపిన ఈ సినిమా రీసెంట్ గా 4 వ సారి టెలికాస్ట్ అవ్వగా 5.71 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

సినిమా లాంగ్ రన్ లో టెలివిజన్ లో కూడా సాలిడ్ గా TRP రేటింగ్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుండటం విశేషం. ఇక సాయి ధరం తేజ్ నటించిన కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటర్ కరోనా ఎఫెక్ట్ వలన రిలీజ్ ని సొంతం చేసుకోలేదు. ఈ ఇయర్ ఎండ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here