బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ సెన్సేషన్ రాక్షసుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా బిజినెస్ ని అందుకునే విధమైన కలెక్షన్స్ ని అయితే సాధించడం లేదు, తొలి 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కేవలం 4.04 కోట్ల షేర్ ని మాత్రమె వరల్డ్ వైడ్ గా సాధించగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఆదివారం అవ్వడం తో సినిమా జోరు పెంచింది అని చెప్పొచ్చు.
వర్షాలు అంతలా లేకపోవడం, తొలి రోజు కన్నా బెటర్ ఆక్యుపెన్సీ తో చాలా సెంటర్స్ లో సినిమా జోరు కొనసాగింది, ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా సినిమా క్లాస్ సెంటర్స్ లో మంచి గ్రోత్ ని సాధించగా మాస్ సెంటర్స్ లో కూడా తొలి 2 రోజుల కన్నా కూడా….
బెటర్ ఆక్యుపెన్సీ తో రన్ అయింది, దాంతో సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అన్నీ అనుకున్నట్లు జరిగితే తొలి రోజు కన్నా ఎక్కువ షేర్ అంటే 2 కోట్ల కి పైగా షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఇది మంచి గ్రోత్ అనే చెప్పాలి.
కానీ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 17.2 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ బరిలో అందుకోవాల్సి ఉంటుంది. అందుకు తొలి వీకెండ్ లో ఎంత లేదన్నా 9 నుండి 10 కోట్ల వరకు షేర్ ని అందుకుంటే వర్కింగ్ డేస్ లో స్లో అయినా వారం పది రోజుల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని…
సులువుగా అందుకునే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు మొదటి వీకెండ్ ని 6.2 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో ముగించే అవకాశం ఎక్కువగా ఉండటం తో సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ చేస్తూ రెండో వీకెండ్ వరకు ఇలాంటి గ్రోత్ నే మెయిన్ టైన్ చేయాల్సి ఉంటుంది, ఇక వీకెండ్ అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.