బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కానీ రెండో రోజు కి వచ్చే సరికి పాజిటివ్ టాక్ పవర్ ని చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ని సొంతం చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇక సినిమా ఇప్పుడు మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ట్రెండ్ ని చూపిస్తూ దంచికొడుతూ పాజిటివ్ టాక్…
పవర్ ను చూపిస్తూ దూసుకు పోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండో రోజుతో పోల్చితే మూడో రోజు ఓపెనింగ్స్ ఆల్ మోస్ట్ సిమిలర్ గా ఉండగా కొన్ని చోట్లా గ్రోత్ కనిపించింది. ఇక ఈవినింగ్ షోలకి గ్రోత్ కనిపిస్తూ ఉండటంతో ఈ రోజు సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో 1.1 కోట్ల నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే పొతే ఈ కలెక్షన్స్ 1.3 కోట్ల నుండి 1.4 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా మాత్రం సినిమా 1.7 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని…
అందుకునే అవకాశం కనిపిస్తుంది, అన్ని చోట్లా లెక్కలు ఇంకా బెటర్ గా ఉంటె ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, మొత్తం మీద వర్షాలు ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఇదే రేంజ్ లో కలెక్షన్స్ తో సినిమా వీకెండ్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక టోటల్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.