మొదటి 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం లేపిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేయగా మూడో రోజు ఇప్పుడు సండే అడ్వాంటేజ్ తో…
అన్ని చోట్లా మళ్ళీ రాంపేజ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది ఇప్పుడు… ట్రాక్ చేసిన సెంటర్స్ లో 15-20% రేంజ్ లో డ్రాప్స్ ఉన్నా కూడా ఓవరాల్ గా సినిమా రోజును సాలిడ్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే…
మూడో రోజు 4.5 కోట్ల రేంజ్ నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించి పొతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది…ఇవాళ 2 IPL మ్యాచులు ఉండటంతో వాటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది…
ఆ ఇంపాక్ట్ మరీ అనుకున్న రేంజ్ లో లేక పొతే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఎక్కువ వసూళ్ళని అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఓవర్సీస్ లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా ఇక డే 3 ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ తో అంచనాలను అందుకుని మించిపోతుందో చూడాలి ఇక…