Home న్యూస్ టాప్ స్టార్స్ పేర్లు మారిపోయాయిగా….ఎవరికి ఏ పేరంటే!

టాప్ స్టార్స్ పేర్లు మారిపోయాయిగా….ఎవరికి ఏ పేరంటే!

0

మన దగ్గర టాప్ స్టార్స్ ఎక్కువ మందే ఉన్నారు…మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే మన దగ్గర సీనియర్స్ అలాగే టాప్ స్టార్స్ సంఖ్య ఎక్కువ, ఎవరికీ అయినా కూడా మంచి టాక్ సొంతం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక రచ్చ లేపడం ఖాయం, ఇక మన హీరోలు అందరికీ కూడా పేరుకి ముందు పెద్ద పెద్ద ట్యాగ్ లు కూడా ఉన్నాయి….

కొందరు హీరోల పేరు ముందు ఉన్న ట్యాగ్ లు చాలా కాలంగా అలాగే కొనసాగుతూ ఉండగా కొందరివి మాత్రం రీసెంట్ గా మారాయి…. ముఖ్యంగా ముగ్గురు టాప్ స్టార్స్ పేర్ల ముందు ఉన్న ట్యాగ్ లు తక్కువ టైంలో మారగా సోషల్ మీడియాలో ఇప్పుడు పాత ట్యాగ్ ల ప్లేస్ లో ఈ కొత్త ట్యాగ్ లు హాల్ చల్ చేస్తూ ఉండటం విశేషం…

ముందుగా పుష్ప పార్ట్1(Pushpa The Rise) మూవీ టైంలో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా పేరు మార్చుకున్నాడు అల్లు అర్జున్(Allu Arjun)… ఆ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకోగా తన అప్ కమింగ్ మూవీస్ అన్నింటికీ కూడా ఇదే ట్యాగ్ ఇప్పుడు కొనసాగబోతుంది…

AP-TG 9th Day Highest Share Movies

ఇక ఇది వరకు ఏ 1 స్టార్ నుండి యంగ్ టైగర్ గా మారిన ఎన్టీఆర్(Jr NTR) మాస్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోగా RRR మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు చేస్తున్న దేవర(Devara Part 1 Movie) కి గాను మ్యాన్ ఆఫ్ మాసెస్ గా కొత్త ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు…

ఈ ట్యాగ్ చాలా టైంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వాడుతూ ఉండగా ఇప్పుడు అదే అఫీషియల్ గా ఎన్టీఆర్ పేరు ముందు జోడించారు…. ఇక మెగా పవర్ స్టార్ గా మొదటి సినిమాకే ట్యాగ్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్(Ram Charan) RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకోగా….

ఆస్కార్ వలన గ్లోబల్ రేంజ్ లో పేరు కూడా రావడంతో ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా కొత్త ట్యాగ్ ను సొంతం చేసుకోగా RC16 మూవీ స్టార్టింగ్ లో అఫీషియల్ గా ఈ ట్యాగ్ ను వాడారు…ఇలా ఈ ముగ్గురు స్టార్స్ కొత్త ట్యాగ్ లను సొంతం చేసుకోగా వీళ్ళ అప్ కమింగ్ మూవీస్ తో వీళ్ళ రేంజ్ ఇంకా ఏ లెవల్ కి వెళుతుందో చూడాలి. ఎవరి ట్యాగ్ బాగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

AP-TG 2nd Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here