దసరా పండగ హాలిడేస్ లో కచ్చితంగా కుమ్మేస్తుంది అనుకున్న సినిమా మహా సముద్రం, ఇద్దరు హీరోలు ఫామ్ లో లేకున్నా కానీ టీసర్ ట్రైలర్ లు ఆకట్టుకోవడం, మంచి మాస్ స్టఫ్ ఉన్న సినిమాలా అనిపించడంతో కచ్చితంగా మహా సముద్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రాంపేజ్ చూపెడుతుంది అనుకున్నారు కానీ రిలీజ్ రోజు సినిమా కి టాక్ మిక్సుడ్ గా రావడం తో కలెక్షన్స్ ఆ రోజు ఈవినింగ్ షోల నుండే చాలా గట్టిగా…
డ్రాప్ అవ్వడం మొదలు అవ్వగా తర్వాత ఇతర సినిమాలు పోటి లో రిలీజ్ అవ్వడంతో ఆ పోటి ని సినిమా తట్టుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక పోయింది. మొత్తం మీద సినిమా మొదటి 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని…
ఇప్పుడు అతి కష్టమైన కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుంది. సినిమా 3 వ రోజు 89 లక్షల షేర్ ని అందుకుంటే 4 వ రోజు సినిమా 60-70 లక్షల రేంజ్ షేర్ ని అందుకుంటుంది అనుకుంటే ఏమాత్రం గ్రోత్ చూపలేక పోయిన సినిమా 60 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ గా మహా సముద్రం ఇప్పుడు…
4 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.77Cr
👉Ceeded: 1.04Cr
👉UA: 70L
👉East: 37L
👉West: 29L
👉Guntur: 50L
👉Krishna: 27L
👉Nellore: 23L
AP-TG Total:- 5.17CR(8.68CR~ Gross)
Ka+ROI: 20L
OS – 28L
Total WW: 5.65CR(9.85CR~ Gross)
ఇదీ సినిమా 4 రోజుల కలెక్షన్స్ పరిస్థితి…
సినిమాను టోటల్ గా 13.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 8.35 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ కలెక్షన్స్ ని సినిమా రికవరీ చేసే అవకాశం ఇప్పుడు కనిపించడం లేదనే చెప్పాలి.