Home న్యూస్ ఇద్దరికీ హిట్స్ లేవు…అయినా నిర్మాతకి ప్రాఫిట్స్…మహా సముద్రం బడ్జెట్ మీద ప్రాఫిట్ ఎంతంటే!!

ఇద్దరికీ హిట్స్ లేవు…అయినా నిర్మాతకి ప్రాఫిట్స్…మహా సముద్రం బడ్జెట్ మీద ప్రాఫిట్ ఎంతంటే!!

0

శర్వానంద్ మరియి సిద్దార్థ్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ మహా సముద్రం పై రిలీజ్ కి ముందు మంచి అంచనాలు ఉండేవి, టీసర్ ట్రైలర్ లు ప్రామిసింగ్ గా ఉండటంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సెలవుల్లో మిగిలిన సినిమాల కన్నా కూడా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుందేమో అన్న ఆశలు అందరికీ ఉండేవి కానీ వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా టాక్ కూడా డీసెంట్ గానే ఉన్నా…

బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం ఇంపాక్ట్ ని చూపెట్టలేక పోయిన ఈ సినిమా ఏ దశలో కూడా బిజినెస్ ను అందుకునే కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకోలేదు. హీరోలు ఇద్దరూ ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా రిలీజ్ కి ముందే ఓవరాల్ బిజినెస్ తో నిర్మాతకి…

మంచి ప్రాఫిట్స్ ని అందించింది… ఒక సారి ఆ డీటైల్స్ ని గమనిస్తే… సినిమా థియేట్రికల్ బిజినెస్ 13.5 కోట్ల రేటు పలకగా శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ కింద 18.5 కోట్ల రేటు పలికిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కింద 6 కోట్ల రేటు సొంతం చేసుకుందట.

ఇక మ్యూజిక్ రైట్స్ కింద 50 లక్షలు, ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ కింద 2.5 కోట్ల రేటు సొంతం అయ్యిందట. దాంతో టోటల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ 27.5 కోట్ల రేంజ్ లో జరిగింది. టోటల్ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ రెండూ కలిపి ఈ సినిమా 41 కోట్ల రేంజ్ లో టోటల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. ఇక సినిమా కోసం మొత్తం మీద…

27 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ని పెట్టడం జరిగిందట. ఆ బడ్జెట్ తీసేసినా నిర్మాతలకు సినిమా ద్వారా 14 కోట్ల మేర ప్రాఫిట్ దక్కిందని చెప్పొచ్చు. ఫ్లాఫ్స్ లో ఉన్నా నిర్మాతలకు సాలిడ్ ప్రాఫిట్స్ ను తెప్పిస్తున్నాడు కాబట్టే శర్వానంద్ కి వరుస పెట్టి సినిమా అవకాశాలు ఎప్పటికీ ఉన్నాయని చెప్పాలి. నిర్మాతకి ప్రాఫిట్స్ వచ్చినా కొన్న బయ్యర్స్ కి మాత్ర్రం లాస్ గట్టిగానే ఉండే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here