శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తో రిలీజ్ అయింది, సినిమా కి పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాగా సినిమా ఇక శర్వానంద్ కి మంచి కంబ్యాక్ మూవీ గా నిలుస్తుంది అని అంతా అనుకున్నారు… కానీ 4 రోజుల వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పరిస్థితి దయనీయంగా మారిపోయింది ఇప్పుడు. మొత్తం మీద సినిమా 4 వ రోజు…
ఊహకందని గ్రోత్ ని సొంతం చేసుకోవాలి అన్న టార్గెట్ తో బరిలోకి దిగినా కానీ మొత్తం మీద కేవలం 96 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కలెక్షన్స్ బాలేకున్నా టికెట్ హైక్స్ విపరీతంగా పెంచడం లాంటివి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై ప్రభావం చూపుతున్నాయి.
సినిమా కి టాక్ ఉన్నప్పటికీ టికెట్ హైక్స్ వలన జనాలు అంత రేటు పెట్టి ఈ మూవీ చూడటం కన్నా తగ్గాక చూసుకోవడం బెటర్ అని ఆగుతున్నారు. అండ్ పోటి లో జాతితర్నాలు కూడా కుమ్మేయడంతో సినిమా పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర..
సినిమా మొత్తం మీద 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.38Cr
👉Ceeded: 1.34Cr
👉UA: 1.06Cr
👉East: 66L
👉West: 47L
👉Guntur: 92L
👉Krishna: 44L
👉Nellore: 30L
AP-TG Total:- 7.57CR (12.90Cr Gross~)
Ka+ROI – 22L( updated )
OS – 32L
Total World Wide: 8.11CR( 14CR~ Gross)
ఈ రేంజ్ లో షాక్ ఇచ్చాయి శ్రీకారం కలెక్షన్స్ లెక్క…
సినిమాను టోటల్ గా 17 కోట్లకు అమ్మగా 17.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పుడు 4 రోజుల్లో కేవలం 8.11 కోట్లు రికవరీ చేసి బ్రేక్ ఈవెన్ కి ఇంకా 9.39 కోట్ల దూరంలో ఉంది…వర్కింగ్ డేస్ లో అద్బుతాలు జరిగితే తప్పితే హిట్ గీత దాటడం కష్టమే అని చెప్పాలి. ఇంకా టికెట్ హైక్స్ అలాగే ఉండటం వర్కింగ్ డేస్ పై కూడా ఇంపాక్ట్ చూపుతుంది.