Home గాసిప్స్ 40 కోట్ల హీరో….రేసులో ఇద్దరు…ఎవరు ఫైనల్ అవుతారో??

40 కోట్ల హీరో….రేసులో ఇద్దరు…ఎవరు ఫైనల్ అవుతారో??

0

కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని లాస్ట్ ఇయర్ సొంతం చేసుకున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య… లాస్ట్ ఇయర్ సమ్మర్ లో మజిలీ సినిమా తో సాలిడ్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని కెరీర్ లో మొట్ట మొదటి 40 కోట్ల సినిమా ను తన ఖాతాలో వేసుకున్న నాగ చైతన్య తన లేటెస్ట్ మూవీ తో మళ్ళీ ఈ రికార్డ్ కొట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న తన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ దుమ్ము లేపడం ఖాయంగా కనిపిస్తుండగా ఈ సినిమా తర్వాత నాగ చైతన్య చేయబోయే సినిమా ఇంకా కన్ఫాం కాలేదు.

రేసులో వినిపిస్తున్న పేర్లు మారుతూనే ఉన్నాయి కానీ ఎవ్వరూ ఇంకా ఫైనల్ అవ్వలేదని తెలుస్తుంది… ముందుగా గీత గోవిందం ఫేం పరశురాం తో సినిమా కన్ఫాం చేశారు కానీ సడెన్ గా మహేష్ తో సినిమా వలన ఈ ప్రాజెక్ట్ ని పోస్ట్ పోన్ చేశారు. ఇక తర్వాత ఇద్దరు డైరెక్టర్స్ రేసులో ఎంటర్ అయ్యారు.

ముందుగా రీసెంట్ టైం లో ఫాం కోల్పోయిన క్లాస్ డైరెక్టర్ విక్రం కుమార్ తో సినిమా కన్ఫాం అనే అనుకుంటూ ఉండగా సడెన్ గా మరో డైరెక్టర్ పేరు వినిపించడం మొదలు అయింది… నాని 25 వ సినిమా వి ది మూవీ కంప్లీట్ చేసిన మోహన కృష్ణ ఇంద్రగంటి చెప్పున కథ నాగ చైతన్య కి నచ్చడం తో…

ఈయన కూడా రేసు లో ఉన్నట్లే అంటున్నారు… మొత్తం మీద ఈ ఇద్దరు డైరెక్టర్స్ లో ఎవరు ఫైనల్ గా కన్ఫాం అవుతారు అన్నది ఇంకా తేలాల్సి ఉండగా ఇద్దరితో సినిమాలు అయితే ఆల్ మోస్ట్ కన్ఫాం అనే అంటున్నారు. నాగ చైతన్య కెరీర్ టర్నింగ్ ఫేస్ లో ఉన్న టైం లో ఈ ఇద్దరి సినిమాలు కూడా అంచనాలు అందుకుంటే తన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here