Home గాసిప్స్ రైజ్, రూల్, రోర్….ఇదేమి ట్విస్ట్ సామి అసలు!

రైజ్, రూల్, రోర్….ఇదేమి ట్విస్ట్ సామి అసలు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోవిడ్ టైంలో పాన్ ఇండియా రేంజ్ లో ఊహించని బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసిన సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సుకుమార్(Sukumar) ల క్రేజీ కాంబోలో వచ్చిన పుష్ప ది రైజ్(Pushpa The Rise) మూవీ…. ఇతర భాషల్లో రిలీజ్ అవుతుందో లేదో అన్న డౌట్స్ తో రిలీజ్ అయ్యి…

అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకుని తర్వాత డిజిటల్ రిలీజ్ తర్వాత వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సీక్వెల్ పుష్ప ది రూల్(Pushpa The Rule) ఆడియన్స్ ముందుకు ఈ ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉండగా ఆల్ టైం రికార్డులు ఈ సినిమా నెలకొల్పే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Pushpa 2 Weeks(14 Days) Total Collections

ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సినిమా రెండు పార్టులతోనే ఆగిపోకుండా ఇప్పుడు మూడో పార్ట్ కూడా ఉండబోతుందని అంటున్నారు… పుష్ప ది రూల్ క్లైమాక్స్ లో పుష్ప ది రోర్ అంటూ మూడో పార్ట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని స్ట్రాంగ్ గా బజ్ వినిపిస్తుంది…

పార్ట్ 2 స్టొరీ బాగా వచ్చిందని, దాంతో పాటు పార్ట్ 3 కి కూడా సరిపడే కథ ఉండటం వలన ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తుంది. ఒకవేళ ఇది నిజం అయ్యి పార్ట్ 2 అంచనాలను అందుకుని మాస్ రచ్చ చేస్తే ఇక పార్ట్ 3 కి ఊహకందని రికార్డుల వర్షం కురవడం ఖాయమని చెప్పొచ్చు. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం అవుతాయో చూడాలి.

Pushpa 11 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here