నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమిగోస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి వీకెండ్ లో కొంచం పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించినా కానీ తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయిన సినిమా వర్కింగ్ డేస్ లో మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేక కంప్లీట్ గా డౌన్ అయిపొయింది. ఇక రెండో వారంలో అడుగు పెట్టిన ఈ సినిమా…
కొత్త సినిమాల కోసం థియేటర్స్ ని చాలా ఎక్కువగానే కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు. సినిమా రిలీజ్ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 430 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా రెండో వారానికి వచ్చే సరికి మొత్తం మీద ఇప్పుడు….
90 లోపే థియేటర్స్ లో రన్ అవుతూ ఉండటం విచారకం, సినిమా అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా సగం వరకు ఉండగా సినిమా ఇక ఆ టార్గెట్ ను అందుకునే అవకాశం లేక పోవడంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయం అయ్యింది అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్ కి బింబిసార తర్వాత భారీ నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం చేసి పెట్టింది అని చెప్పాలి. ఈ సినిమాతో బాక్ టు బాక్ హిట్స్ కొడతాడు అనుకుంటే బింబిసార డే 1 కలెక్షన్స్ ని కూడా అమిగోస్ సినిమా ఇప్పటి వరకు అందుకోలేక పోవడం విచారకం.