Home న్యూస్ పుష్పకవిమానం@450, టోటల్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

పుష్పకవిమానం@450, టోటల్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

0

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఆడియన్స్ ముందుకు దొరసాని సినిమాతో అడుగు పెట్టి మెప్పించినా సక్సెస్ ను అందుకోలేదు, తర్వాత మిడిల్ క్లాస్ మెలోడిస్ డిజిటల్ హిట్ గా నిలవగా ఇప్పుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్పక విమానం సినిమా ప్రేక్షకుల ముందుకు 12 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా పై మంచి అంచనాలే ఆడియన్స్ లో ఏర్పడ్డాయి.

లైట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది, ఇది సాలిడ్ రిలీజ్ అనే చెప్పాలి. అందులో తెలుగు రాష్ట్రాలలో నైజాంలో 108 థియేటర్స్ లో, సీడెడ్ లో 40 థియేటర్స్ లో ఆంధ్రలో 150 థియేటర్స్ లో…

రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 300 కి అటూ ఇటూగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది…ఇక వరల్డ్ వైడ్ గా 450 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా ఓవరాల్ బిజినెస్ ను గమనిస్తే… నైజాంలో 65 లక్షలు, సీడెడ్ లో 25 లక్షలు…

ఆంధ్రలో 80 లక్షల దాకా బిజినెస్ అందుకుందని ట్రేడ్ లో సమాచారం. దాంతో సినిమా తెలుగు రాష్ట్రాలలో 1.7 కోట్ల బిజినెస్ ను వరల్డ్ వైడ్ గా 2 కోట్ల దాకా బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ ని అందుకోవాలి అంటే మినిమమ్ 2.3 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి.

450 థియేటర్స్ లో 2.3 కోట్ల టార్గెట్ పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా అందుకునే అవకాశం ఉంటుంది, ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ స్టార్ట్ అయినా యావరేజ్ గానే ఉన్నాయి. మౌత్ టాక్ బాగుంటే షో షో కి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది సినిమా కి. మరి సినిమా ఎంతవరకు అనుకున్న టార్గెట్ ను అందుకుంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here