Home న్యూస్ “47 డేస్” మూవీ రివ్యూ…..ఏంటి సామి ఇది!!

“47 డేస్” మూవీ రివ్యూ…..ఏంటి సామి ఇది!!

0

ఆడియన్స్ ని ఈ మధ్య ఎక్కువగా ఆకర్షిస్తున్న జానర్ “థ్రిల్లర్” జానర్… మంచి కథ టైట్ స్క్రీన్ ప్లే ఉంటే చాలు థ్రిల్లర్ సినిమాలు చూడటానికి చాలా మంది ఉన్నారు. కానీ థ్రిల్లర్ అంటూ చెప్పిన ప్రతీ సినిమా అలా అనిపించదు. నామ మాత్రపు థ్రిల్లర్ మూవీస్ కూడా కొన్ని ఉంటాయి… రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ సొంతం చేసుకున్న 47 డేస్ సినిమా కూడా ఇందులో ఒకటి.

టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ హీరోగా పూరి జగన్నాథ్ అసిస్టంట్ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా జీ 5 లో డైరెక్ట్ గా స్ట్రీం అయ్యింది. చాలా చిన్న లెంత్ ఉన్న ఈ థ్రిల్లర్ మూవీ కథ కూడా చిన్నదిగా నే ఉండగా దాన్ని ఆడియన్స్ కి చెప్పడంలో విఫలం అయ్యారు అందరూ.

కథ పాయింట్ కి వస్తే… ఏసిపీ అయిన హీరో భార్య అనుకోకుండా ఆత్మహత్య చేసుకుంటుంది, దానికి రీజన్స్ ఏంటని తెలియక డ్యూటీ సరిగ్గా చేయలేక సస్పెండ్ అయిన హీరో తన భార్య చనిపోయిన టైం లోనే చనిపోయిన మరో వ్యక్తీకి తన భార్య మరణానికి లింక్ ఉందని భావిస్తాడు.

అసలు ఇంతకి తన భార్య ఎందుకు చనిపోయింది, అదే రోజు చనిపోయిన మరో వ్యక్తీ ఎవరు… హీరో కేసు ఎలా సాల్వ్ చేశాడు, ఇదంతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ చాలా చిన్నది, సినిమా కూడా చాలా చిన్నదే కానీ చూస్తున్న ఆడియన్స్ ఎప్పుడు అయిపోయిందా అని ఎదురు చూడక తప్పని పరిస్థితి.

కొన్ని కొన్ని సీన్స్ ఎంత ఇల్లాజికల్ గా ఉన్నాయంటే… చిన్నప్పుడు ఎదో రోమియో జూలియట్ నాటకంలో జూలియట్ రోల్ చివరి నిమిషంలో మిస్ చేసుకున్న అమ్మాయి పెద్దయ్యాక ఆ రోమియో రోల్ వేసిన అతన్ని వెతికి ప్రేమించాలని చూసి రాంగ్ పర్సన్ ని కలుస్తుంది. ఇలా సినిమా లో ఎన్నో లాజిక్ లేని…

సీన్స్ చూస్తున్న ఆడియన్స్ కి మరింత విసుగు తెప్పిస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగా సత్యదేవ్ తన వరకు బాగానే నటించినా కథ లో పస లేక పోవడం తో ఏమి చేయలేకపోయాడు. ఇక మిగిలినవాళ్ళు అందరూ నామ మాత్రపు నటననే కనబరిచారు. ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే…

ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి. ఎడిటింగ్ స్క్రీన్ ప్లే ఇంకా చేయాల్సి ఉందనిపించేలా ఉన్నాయి. డైరెక్షన్ పరంగా ప్రదీప్ మద్దాలి అనుకున్న థాట్ బాగానే ఉన్నా దాని అవుట్ పుట్ మాత్రం తీవ్ర నిరాశ పరిచే విధంగా ఉందని చెప్పాలి. సినిమా లో హైలెట్స్ అంటూ ఏమి లేవని చెప్పాలి.

అదే సమయం లో నెగటివ్స్ చెప్పాలి అంటే చాలా చాలా ఉన్నాయని చెప్పాలి. ఇన్ని లొసుగులు ఉన్నాయి కనుకే డీసెంట్ ఆఫర్ రాగానే డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అయ్యారా అనిపించింది. మొత్తం మీద అన్ని సినిమాలు చూసి ఇంకా ఖాళీగా ఉంటే ఈ సినిమా ను ఓ లుక్కేయండి.. సినిమా కి మా రేటింగ్ 1.75/5 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here