కొన్ని కొన్ని సార్లు సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకో గలగాలి, లేకపోతె పరిస్థితి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది, సినిమాల విషయం లో క్రేజ్ ఉన్నప్పుడే సినిమా బిజినెస్ పీక్స్ లో జరిగేలా చూసుకునే నిర్మాతలు ఉన్నారు, ఇక డిమాండ్ ఉన్నప్పుడే సినిమా శాటిలైట్ రైట్స్ ని భారీ రేట్ల కి అమ్ము కుని లాభ పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, రీసెంట్ గా డబ్బింగ్ మూవీ దేవ్ విషయం లో..
ఒక ఆసక్తి కరమైన సంఘటన జరిగింది, సినిమా ను తెలుగు లో రీసెంట్ గా రిలీజ్ చేయగా మినిమమ్ ఓపెనింగ్స్ కూడా సొంతం చేసుకోలేక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని మూట గట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే, కాగా అదే సమయం లో సినిమా రిలీజ్ కి ముందు…
పాటలకు కొంచం బెటర్ క్రేజ్ రావడం సినిమా చాలా రిచ్ గా ఉండటం కార్తీ అప్పటికే రెండు హిట్లు కొట్టడం తో తెలుగు లో శాటిలైట్ రైట్స్ కింద టాప్ చానెల్స్ 4 కోట్ల రేంజ్ లో రేట్లను ఆఫర్ చేశాయట. కానీ నిర్మాత మరియు యూనిట్ మాత్రం అంత తక్కువ కి అమ్మేది లేదని నిర్ణయం తీసుకున్నారట.
సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ని బట్టి రేటు మరింత పెంచవచ్చు అనుకున్న యూనిట్ కి సినిమా రిజల్ట్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది, ఏమాత్రం జోరు లేక కలెక్షన్స్ అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడం తో అదే రేటు ఇమ్మని యూనిట్ ఛానెల్ ని అడగ్గా… ఇప్పుడు ఆ రేటు ఇవ్వమని…
కావాలంటే 50 లక్షల కు సినిమా ను కొంటామని చెప్పారట. అది విన్న నిర్మాత మైండ్ బ్లాంక్ అవ్వగా తర్వాత ఆ ఆఫర్ కూడా వస్తుందో లేదో అనుకుని ఓకే చెప్పాడట. సరైన సమయం లో రియాక్ట్ అయ్యి ఉంటే 4 కోట్లు దక్కేవి, కానీ ఇప్పుడు సినిమా 50 లక్షలకే అమ్ముడు పోవడం షాక్ ఇచ్చింది.