Home న్యూస్ మహర్షి డే 11 ఓపెనింగ్స్…కుమ్ముతున్నాడు!!

మహర్షి డే 11 ఓపెనింగ్స్…కుమ్ముతున్నాడు!!

0

  సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో దుమ్ము లేపుతుంది. 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటిన సినిమా ఇప్పుడు 11 వ రోజు లో ఎంటర్ అయ్యింది. కాగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి ఆక్యుపెన్సీ 10 వ రోజు తో పోల్చితే కేవలం 5% వరకు మాత్రమె డ్రాప్ అవ్వడం విశేషం.

ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల కి బుకింగ్స్ మాత్రం కుమ్మేస్తున్నాయి అని చెప్పాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు ఓ రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా సాధించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే…

11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా షేర్ మినిమం 2 కోట్లు దాటడం ఖాయం… మాగ్జిమం అది ఎంతవరకు వెళుతుంది అన్నది పూర్తిగా ఆఫ్ లైన్ లో జరిగే టికెట్ సేల్స్ ని బట్టి తెలుస్తుంది. మొత్తం మీద రోజు ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here