బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కోలివుడ్ తరుపున మొదటి 1000 కోట్ల సినిమా అవుతుంది అని అందరూ అనుకున్నారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయింది….నాలుగు రోజుల వీకెండ్ లో ఏ దశలో కూడా అంచనాలను అందుకునే కలెక్షన్స్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ తో వీకెండ్ ని ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది…
సినిమా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అతి కష్టం మీద 1 కోటి షేర్ మార్క్ ని దాటింది…వరల్డ్ వైడ్ గా మరోసారి 3వ రోజు లెవల్ లో 14.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 7 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది….. ఇక ఓవరాల్ గా సినిమా…
మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie 4 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 2.95Cr~
👉Ceeded: 1.04Cr~
👉Andhra: 3.28Cr~
AP-TG Total:- 7.27CR(12.45Cr~ Gross)
25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా 17.73 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie 4 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 26.45Cr
👉Telugu States – 12.45Cr
👉Karnataka – 4.30Cr
👉Kerala – 5.80Cr
👉Hindi+ROI – 12.80Cr
👉Overseas – 21.65Cr***approx
Total WW collection – 83.45CR(40.10CR~ Share) Approx
మొత్తం మీద 180 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం మరో 140 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ అఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో హోల్డ్ చూపించ కుంటే భారీ నష్టాలు సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి.