బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi) ఇప్పుడు వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా సినిమా అనుకున్న అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యింది.
4వ రోజు వర్కింగ్ డే లో ముందు 50-60% డ్రాప్స్ ఉన్నట్లు అనిపించినా అది పెరుగుతూ పెరుగుతూ 70% ని దాటేసి తర్వాత 80% కి పైగా డ్రాప్స్ ను 3వ రోజుతో పోల్చితే 4వ రోజున సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు సినిమా కేవలం…
1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని 4వ రోజున సొంతం చేసుకున్న సినిమా ఓవర్సీస్ లో మాత్రం బాగా హోల్డ్ చేయడం కలిసి వచ్చి 4వ రోజు వరల్డ్ వైడ్ గా మాత్రం 2.33 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 4.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.
ఇక టోటల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kushi(2023) 4 Days Total WW Collections Report
👉Nizam: 11.86Cr
👉Ceeded: 2.09Cr
👉UA: 2.57Cr
👉East: 1.31Cr
👉West: 1.04Cr
👉Guntur: 1.30Cr
👉Krishna: 1.15Cr
👉Nellore: 64L
AP-TG Total:- 21.96CR(36.20CR~ Gross)
👉KA+ROI – 2.70Cr~
👉Other Languages – 2.40Cr~
👉OS – 7.80Cr~
Total World Wide – 34.86CR(65.05CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 53.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 18.64 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి…